Vizianagaram Play Poker: ఏపీ పోలీసులు పేకాట స్థావరాలపై కొరఢా ఝులిపిస్తున్నారు. పేకాట స్థావరాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా పోలీసులు విజయనగరం జిల్లాలో ఓ పేకాట అడ్డాపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న మహిళలు పట్టుబడటం పోలీసులు షాక్‌కు గురయ్యారు. పురుషులతో సమానంగా తామేమి తక్కువ కాదన్నట్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో విజయనగరం ఉమెన్ పోలీసు స్టేషన్ ఎస్సై నేతృత్వంలో ఈ రైడ్ జరిగింది.
ఈ దాడిలో రమ్మీ ఆడుతున్న 9 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో దొరికి పోయిన మహిళలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Guntur GGH Fire Accident: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన అధికారులు