Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీటౌన్ సీఐ మృతి.. పెట్రోలింగ్ చేసి..

|

Nov 25, 2021 | 7:23 AM

Visakhapatnam Road Accident: ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎండాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు

Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీటౌన్ సీఐ మృతి.. పెట్రోలింగ్ చేసి..
Road Accident
Follow us on

Visakhapatnam Road Accident: ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎండాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. త్రీటౌన్ సీఐ కరణం ఈశ్వరరావు నైట్ పెట్రోలింగ్‌ను ముగించుకొని ఇంటికి వెళుతుండగా.. పోలీస్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ సంతోష్‎ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ ఈశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‎కు తరలించారు. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గుర్తుతెలియని వాహనం కోసం.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also Read:

Crime News: దారుణాతి దారుణం.. పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం.. ఆపై..

Bizarre Incident: ఆ డీజే సౌండ్‌తో నా కోళ్లు చచ్చాయి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..