విశాఖ పెళ్లి కూతురు సృజన మృతి కేసులో మరో ట్విస్ట్ .. బ్యాగులో గన్నేరు పప్పు.. అదే కారణమా..?
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతోనే ఆమె గన్నేరు పప్పు తిని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి తోడు సృజన మొబైల్ కాల్ రికార్డ్స్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. కాల్ డేటాతో పాటు మెసేజెస్ క్లియర్ చేసి ఉండడాన్ని...
విశాఖపట్నంలో పెళ్లిపైటలపైనే అనుమానాస్పదంగా మృతి చెందిన సృజన కేసులో ఇవాళ కీలక ఆధారాలు బయటకు రానున్నాయి. విశాఖపట్నంలో పెళ్లిపైటలపైనే అనుమానాస్పదంగా మృతిచెందిన నవ వధువు సృజన గన్నేరు పప్పు తిని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి కూతురి బ్యాగ్‌లో గన్నేరు పప్పును గుర్తించినట్లుగా ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతోనే ఆమె గన్నేరు పప్పు తిని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి తోడు సృజన మొబైల్ కాల్ రికార్డ్స్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. కాల్ డేటాతో పాటు మెసేజెస్ క్లియర్ చేసి ఉండడాన్ని విచారణధికారులు గమనించారు. కేవలం మిస్డ్ కాల్స్ మాత్రమే ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోంది. తొలుత మొబైల్ ఇచ్చేందుకు సృజన తల్లితండ్రులు నిరాకరించారు. సృజన సన్నిహితులతో మాట్లాడుతున్నారు పోలీసులు. నవ వధువు సృజన కేసులో ఇవాళ కీలక ఆధారాలు బయటకు రానున్నాయి. సృజన డెడ్‌బాడీకి కాసేపట్లో పోస్ట్‌మార్టమ్ చేయనున్నారు.
ఆమె బ్యాగులో కూడా కొన్ని విషపదార్ధాలు దొరికినట్టు పోలీసులు చెబుతున్నారు. సృజన బ్యాగులో గన్నేరు పంపు ఆనవాళ్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. గన్నేరు పప్పు ఆనవాళ్లు గుర్తించి సృజన హ్యాండ్ బ్యాగ్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే మరిన్ని ఆదాల కోసం అమ్మాయి తల్లిదండ్రులను మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మరింకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే.. కాసేపట్లో సృజన మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించనున్నారు. నేడు కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలావుంటే.. నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంది. ఆ వీడియోలో కూడా సృజన ఆందోళనగా ఉన్నట్లుగా కనిపించలేదు. ఎంతో హ్యాపీగా కనిపించింది. అంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యలు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వధువు సృజన మృతదేహం నుంచి నమూనాలను సేకరించారు పోలీసులు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. పెళ్లి పనుల్లో కూడా సృజన బిజిబిజీగా ఉందని బంధువులు చెప్పడం.. ఇప్పుడు ఆమె బ్యాగ్ గన్నేరు పప్పు లభించడం ఆందోళన కలిగిస్తోంది.