విశాఖ ఖాకీల జులుం.. ప్రశ్నించినందుకు యువతిపై విచక్షణ రహితంగా దాడి

|

Jun 06, 2021 | 8:21 AM

మాస్క్ పెట్టుకోలేదని ఓ తల్లిపై చితకబాధిన ఘటన మరిచిపోక ముందే విశాఖలో ఓ యువతిపై నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేసినంత పని చేశారు. కర్ఫ్యూ సమయంలో...

విశాఖ ఖాకీల జులుం.. ప్రశ్నించినందుకు యువతిపై విచక్షణ రహితంగా దాడి
Visakhapatnam Police Who At
Follow us on

అత్యవసర సమయంలో దేశవ్యాప్తంగా పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శిస్తుంటే … కొందరు  ఖాకీలు మాత్రం జులుం చూపిస్తున్నారు. మొన్న మధ్యప్రదేశ్‌లో మాస్క్ పెట్టుకోలేదని ఓ తల్లిపై చితకబాధిన ఘటన మరిచిపోక ముందే విశాఖలో ఓ యువతిపై నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేసినంత పని చేశారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ విశాఖ నగరానికి చెందిన ఒక ఫార్మసీ మహిళా ఉద్యోగిని పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీశారు. కేవలం జరిమానా ఎందుకు వేశారని ప్రశ్నించినందుకు విశాఖలో ఓ యువతిని పోలీసులు నడిరోడ్డుపై నిలబెట్టి రచ్చ చేశారు. కేవలం ప్రశ్నించినందుకే మాటకు మాట సమాధానం ఇస్తోందని, మద్యం తాగిందని ఆరోపిస్తూ బలవంతంగా ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఇద్దరు పోలీస్‌ అధికారులు, మరో పది మంది పోలీసులు హడావిడి చేశారు.

కరోనా సమయంలో విధి నిర్వహణకు వచ్చిన తనపై దౌర్జన్యం చేయడం ఏమిటని ఆమె ధైర్యంగా నిలదీసింది. దారిన పోతున్నవారు వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్లింది. తిరిగి పని ముగించుకుని సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె సోదరుడు వచ్చి ఇంటికి తీసుకెళ్తుంటారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. శనివారం ఆమెను తీసుకెళ్లడానికి సోదరుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న టూ వీలర్ ఫొటో తీశారు.

విశాఖలో రామాటాకీస్‌ జంక్షన్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ అపర్ణ విశాఖలో ఆరిలోవలో ఉంటూ అపోలో ఫార్మసీలో టైపిస్టుగా పనిచేస్తోంది. పోలీసులు ఆపితే చూపించడానికి ఆమె తన కంపెనీ ద్వారా పర్మిషన్‌ లెటర్‌ తీసుకుంది. ఐడీ కార్డు, ఆ లెటర్‌ కాపీ ఉన్నాయి. మూడో పట్టణ ఎస్‌ఐ ఆపి రూ.535 జరిమానా వేశారు.

ఆ అబ్బాయి ఈ విషయాన్ని లక్ష్మీ అపర్ణకు చెప్పాడు. తిరిగి వెళ్తూ జంక్షన్‌లో ఎస్‌ఐ వద్దకు వెళ్లి.. తనను తీసుకెళ్లడానికి అతను వచ్చాడని, తనకు ఫార్మసీ ఇచ్చిన పాస్‌ ఉందని చూపించారు. ఫైన్‌ రద్దు చేయాలని కోరింది. దాంతో మమ్మల్నే ప్రశ్నిస్తావా? అంటూ పోలీసులు ఆమెపై జులుం ప్రదర్శించారు. విధులకు ఆటంకం కలిగించిందంటూ, ఇద్దరిపై కేసు నమోదు చేయాలని వారి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. తాను తప్పు చేయలేదని, జరిమానా ఎందుకు వేశారని అడగడం తప్పా? అని ప్రశ్నించడం పోలీసులకు నచ్చలేదు.

అంతేకాదు అక్కడే ఉన్న పోలీస్ అధికారి”గట్టిగా పట్టండి…” అంటూ అరవడం వినిపిస్తోంది. అమ్మాయి ఎక్కువ మాట్లాడుతోందని, మద్యం తాగి ఉంటుందని, పరీక్షకు స్టేషన్‌కు తీసుకువెళ్లాలని ఒక పోలీస్‌ అధికారి ఆదేశించారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘నన్ను చంపినా పోలీస్‌ స్టేషన్‌కు రానంటూ’… ఆమె రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో జనం ఎక్కువ మంది రావడం, వాట్సా్‌పల్లో అప్పటికే ఈ దృశ్యాల వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు వారికి సెల్‌ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. రాత్రి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లినట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి: Tirumala heavy rain: తిరుమలలో ఎడతెరపిలేని వర్షం.. మొదటి ఘాట్ రోడ్డులో నేల కూలిన వృక్షం

SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ