తెలుగు రాష్ట్రాల్లో డెత్ మిస్టరీలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ధర్మకార్ శ్రీనివాస్ మర్డర్… ఏపీలో రాహుల్ హత్య కేసుల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇప్పుడు మరో యువతి అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ సింధు ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. సింధు నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేశారా? మర్డర్ చేస్తే ఎవరి పని? ఒకవేళ సింధు ఆత్మహత్య చేసుకుంటే ఆమె తల, ముఖంపై బలమైన గాయాలు ఎందుకున్నాయ్? ఉరేసుకుంటే నోటి నుంచి ఎందుకు వచ్చింది? ఈ అనుమానాలే సింధు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి.
కృష్ణాజిల్లా గంపలగూడానికి చెందిన చెరుకూరి సింధు సీఏ పూర్తిచేసి విజయవాడలో ఉద్యోగం చేస్తోంది. ప్రసేన్ అనే యువకుడిని ప్రేమించిన సింధు… గుణదలలోని అతని ఇంట్లోనే ఉంటుంది. అతని ఇంట్లోనే సింధు అనుమానాస్పద స్థితిలో మరణించింది. అదే, ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. ప్రసేన్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటోన్న సింధు నిజంగానే ఉరి వేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఉరేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సింధు తల, ముఖంపై బలమైన గాయాలు ఉండటమే దీనికి కారణం. పైగా ఉరేసుకుంటే సాధారణంగా నోటి నుంచి రక్తం రాదనేది మరో వాదన. అందుకే, తమ కుమార్తెను ప్రసేన్, అతని కుటుంబ సభ్యులు చంపేసి నాటకం ఆడుతున్నారని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.
సింధు, ప్రసేన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రసేన్ ను ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది సింధు. అయితే, వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదని అంటున్నారు. మరి, ఏమైందో ఏమో ప్రసేన్ ఇంట్లోనే అతనితో కలిసి ఉంటోంది సింధు. అయితే, పెళ్లి గురించి ప్రసేన్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు సింధు తల్లిదండ్రులు అంటున్నారు. పెళ్లి చేసుకోమని అడిగినందుకే సింధుని చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించారని ఆమె తల్లి ఆరోపిస్తోంది.
సింధు ఉరి వేసుకుంటే రక్తపు మడుగులో ఎందుకు పడి ఉంది? సింధు డెడ్ బాడీ పక్కన దొరికిన సుత్తి సంగతేంటి? సింధుని సుత్తితో కొట్టి చంపారా? అందుకే, సింధు తల, ముఖంపై గాయాలు అయ్యాయా? సింధును ప్రసేన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదా? పెళ్లి చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారా? అంటే అవుననే అంటున్నారు సింధు తండ్రి. పెళ్లి చేసుకోవాలంటూ ప్రసేన్ పై సింధుపై ఒత్తిడి తేవడం వల్లే చంపేశారని అంటున్నారు.
Also Read: AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం