Rowdy Sheeters : తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్‌..

|

Sep 06, 2021 | 7:14 AM

Rowdyshitters: విజయవాడలోని రౌడీషీటర్లు భారీ క్యూ కట్టారు. ఏ వ్యాక్సిన్‌ కోసమో, లేకపోతే సబ్సిడీ వస్తువుల కోసమో వచ్చిన వారు కాదు. వారంత వార్నింగ్‌ తీసుకోవడాని వచ్చారు. 

Rowdy Sheeters : తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్‌..
Rowdyshitters
Follow us on

విజయవాడలోని రౌడీషీటర్లు భారీ క్యూ కట్టారు. ఏ వ్యాక్సిన్‌ కోసమో, లేకపోతే సబ్సిడీ వస్తువుల కోసమో వచ్చిన వారు కాదు. వారంత వార్నింగ్‌ తీసుకోవడాని వచ్చారు. నగరంలోని 555 మంది రౌడీషీటర్లను మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోకి పిలిచి వార్నింగ్‌ ఇచ్చారు ఏసీపీ షాను. ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని కౌన్సిలింగ్‌ ఇచ్చారు పోలీసులు. విజయవాడ నార్త్ జోన్ పరిధిలో ఈ ఏడాది కొత్తగా 53 రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు ఏసీపీ షాను. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక నుంచి ప్రతిరోజు రాత్రి సమయంలో రౌడీషీటర్ ఇంటికి వెళ్లి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు ఏసీపీ. మహిళా భద్రత విషయంలో దిశ యాప్ ఎంతగానో తోడ్పడుతుందన్న ఏసీపీ షాను.. నగరంలో పాఠశాల, కళాశాల వద్ద దిశా పెట్రోలింగ్ వాహనం ఉంటుందన్నారు. నార్త్ జోన్ పరిధిలో ఆరు దిశ పెట్రోలింగ్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు పోలీసులు.

నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు, నగరంలో పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రతి ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంతో కలిసి అకతాయిలకు చెక్‌ పెడుతున్నారు పోలీసులు.

పబ్లిక్‌గా న్యూసెన్స్‌ చేసేవారిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది. అకతాయిల పట్ల కఠినంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. దీంతో రౌడీషీటర్లపై నిఘాపెట్టి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌ వినిపించదు ఎందుకో తెలుసా..

Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..