Vijayawada Minor girl ends life: ఎంతో భవిష్యత్ ఉన్న చదువుల తల్లి. రేపటి తరం ముద్దుబిడ్డ. ఆకతాయి వేధింపులకు అర్థాంతరంగా తనువు చాలించింది. 14 ఏళ్లకే వందేళ్లు నిండాయి. విజయవాడలో ఆకతాయి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుమ్మరిపాలెం సెంటర్ ప్రాంతంలో తనను వేధిస్తున్నాడంటూ వినోద్ జైన్ అనే వ్యక్తి పేరును సూసైడ్ నోట్‌లో రాసింది బాలిక. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికకు 14 ఏళ్లు మాత్రమే నిండాయి. అదే ప్రాంతానికి చెందిన వినోద్ జైన్.. తనతో చనువుగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. పలుమార్లు వద్దని వారించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకడంతో రక్తపు మడగులో నిండిపోయింది ఆమె శరీరం. వెంటనే అక్కడకు చేరుకున్న బంధువులు.. గుండెలు అవిసెలా రోధించారు. బాలక మృతదేహాన్ని చూసి గుండెలు బాధుకున్నారు. ఎంతో రోధించినా ఏం ప్రయోజనం? బాధితురాలి ప్రాణం అప్పటికే గాల్లో కలిసిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఆకతాయి వేధింపులతో బాలిక చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వాస్తవానికి ఆడపిల్లల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వారి రక్షణ కోసం కఠిన చట్టాలు సైతం తీసుకువచ్చింది. అయినా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో కొందరు ఇలా వేధిస్తూ.. యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తీసుకువచ్చి, పోలీస్ స్టేషన్‌లను సైతం ఏర్పాటు చేసింది. బాధితురాలు ఆ టార్చర్‌ను పేరెంట్స్, టీచర్స్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లిందో లేదో.. తెలియదో కాని.. తన జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టుకుంది. మృతదేహాన్ని మార్చురుకి తరలించారు పోలీసులు.
Read Also… Railway Track Facts: రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి కారణం ఏమిటి..?