Vijayawada: రాహుల్ మిస్టరీ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. కారులో కీలక ఆధారాలు లభ్యం.. డ్రైవర్ సీట్‌లో

|

Aug 19, 2021 | 3:48 PM

రాత్రి మిస్సింగ్‌ కేసు నమోదైంది.. ఉదయం కారులో డెడ్‌బాడీ కనిపించింది.. అయితే రాహుల్‌ ఎలా చనిపోయాడు ? ఎవరైనా హత్య చేశారా ? అసలు మాచవరం ఎందుకొచ్చాడు?...

Vijayawada: రాహుల్ మిస్టరీ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. కారులో కీలక ఆధారాలు లభ్యం..  డ్రైవర్ సీట్‌లో
Vijayawada Dead Body
Follow us on

రాత్రి మిస్సింగ్‌ కేసు నమోదైంది.. ఉదయం కారులో డెడ్‌బాడీ కనిపించింది.. అయితే రాహుల్‌ ఎలా చనిపోయాడు ? ఎవరైనా హత్య చేశారా ? అసలు మాచవరం ఎందుకొచ్చాడు? ఇవన్నీ కూడా ఈ కేసులో అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. తాజాగా కారు డోర్స్‌ని ఓపెన్‌ చేశారు పోలీసులు. స్మార్ట్‌ కార్‌ ఎక్స్‌పర్ట్స్‌ సాయంతో డోర్స్‌ ఓపెన్‌ చేశారు.  మాచవరంలో పార్క్‌ చేసిన కారులో ఉన్న మృతదేహం తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌దిగా గుర్తించారు పోలీసులు. AP 16FF 9999 నెంబర్‌తో ఉన్న ఫోర్డ్‌ ఎండీవర్‌ ఓనర్‌ రాహుల్‌ అని తేల్చారు. జి కొండూరులో ఉన్న జిక్సిన్‌ సిలిండర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ యజమాని కరణం రాహుల్‌. అయితే అనుమానాస్పదరీతిలో కారులో రాహుల్‌ డెడ్‌బాడీ కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. రాహుల్‌ ఎలా చనిపోయాడనేది అటు కుటుంబ సభ్యులకు కూడా మిస్టరీగా ఉంది.

రాహుల్‌ది హత్యా ? లేక ఆత్మహత్యా ? లేదా హార్ట్‌ ఎటాక్‌ తో చనిపోయి ఉంటాడా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. నిపుణులతో కారు డోర్లు ఓపెన్ చేయించగా..  డ్రైవర్ సీట్ లో ప్లాస్టిక్ తాడు దొరికింది. గొంతుకు తాడుబిగించి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు.  రాహుల్‌ది హత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

జి కొండూరులో ఉన్న జిక్సన్‌ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఎంత మంది పార్ట్‌నర్స్‌ ఉన్నారు? వారితో ఏమైనా విభేధాలు ఉన్నాయా ? అనేది కూడా తేలాల్సి ఉంది. అతడిది హత్యే అని సైంటిఫిక్‌గా నిర్ధారిస్తే.. వాళ్లు ఎవరు ? ఎందుకు చంపారు ? అనేది కూడా తేలాల్సి ఉంది. అసలు రాహుల్‌ మాచవరం ఎందుకు వచ్చాడనేది కూడా మిస్టరీగానే మారింది. కెనడాలో MS చేసిన రాహుల్‌ ఇటీవలే విజయవాడకు వచ్చి గ్యాస్‌ కంపెనీ ప్రారంభించాడు. ఇటీవల ఒంగోలులో కూడా ఓ కంపెనీకి శంకుస్థాపన చేశారు. దీంతో కొత్త కంపెనీ విషయంలో వ్యాపార లావాదేవీల్లో ఏమైనా తేడాలు వచ్చాయా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరణం రాహుల్‌కు వ్యాపార లావాదేవీల్లో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్‌ బుధవారం నుంచి కనిపించకుండాపోవడంతో పెనమలూరు పోలీస్టేషన్‌లో రాత్రి మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఉదయమే కారులో శవంగా దర్శనమివ్వడంతో కలకలం చెలరేగింది.  రాహుల్‌ బుధవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఇంటి నుంచి బయటకి వెళ్లిన రాహుల్‌ తిరిగి రాకపోవడంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఫోన్‌ కూడా స్విఛ్చాఫ్‌లో ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read: కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు జగన్ సర్కార్ ఆపన్న హస్తం.. కీలక ఆదేశాలు

ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ కొనాలంటే ఇక జేబులకు చిల్లులే