ఎదురు కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, వయాగ్రా స్వాధీనం.

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో ఈ నెల 6 న జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఘటనా స్థలం నుంచి సెక్యూరిటీ దళాలు కొన్ని వయాగ్రా టాబ్లెట్లను, ఏకే సీరీస్ రైఫిల్స్ ని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఎదురు కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, వయాగ్రా స్వాధీనం.
Viagra And Guns Recovered From 2 Terrorists Killed In Jammu Kashmir

Edited By: Anil kumar poka

Updated on: Aug 10, 2021 | 6:42 PM

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో ఈ నెల 6 న జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఘటనా స్థలం నుంచి సెక్యూరిటీ దళాలు కొన్ని వయాగ్రా టాబ్లెట్లను, ఏకే సీరీస్ రైఫిల్స్ ని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ జిల్లాలోని ధనామండి ప్రాంతంలో జరిగిన ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒకరు పాకిస్థానీ అని, దొంగచాటుగా జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించాడని తెలిసింది. పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోకి చొరబడినట్టు తెలియడంతో వారి కోసం భద్రతా దళాలు గాలించగా ఒక చోట నక్కిన వీరు కాల్పులు జరిపారు. అయితే సెక్యూరిటీ అధికారుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించగా మిగిలినవారు పారిపోయారు. వయాగ్రా టాబ్లెట్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ తరహా టాబ్లెట్లు బయట పడడం ఇదే మొదటిసారి.

ఇదే జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఓ టార్చ్ ని,, రేడియో సెట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా దేశ స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తుండడంతో జమ్మూ కాశ్మీర్ సహా దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాల వద్ద నిఘా పెంచారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద విజిటర్లను అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. జమ్మూ కాశ్మీర్ కి ఇప్పటికే అదనపు బలగాలను పంపారు.

మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..

 ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.

 వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.

 బైక్‌ షోరూమ్‌లో స్మార్ట్‌ దొంగలు.. వీళ్ల తెలివికి ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.!షాక్ లో ఓనర్స్..:Smart thieves in bike showroom Video.