ఉన్నావ్ బాధితురాలికి బ్లడ్ ఇన్ఫెక్షన్.. పరిస్థితి విషమం.

ఉన్నావ్ బాధితురాలు తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఈమెకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. బ్లడ్ కల్చర్ పరీక్ష నిర్వహించగా.. ఆమె రక్తంలో బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకిందని వారు తెలిపారు. గత జులై 28 న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొనడంతో ఈమెతో బాటు ఈమె లాయర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళ మరణించింది. […]

ఉన్నావ్ బాధితురాలికి బ్లడ్ ఇన్ఫెక్షన్..  పరిస్థితి విషమం.
Anil kumar poka

|

Aug 08, 2019 | 5:10 PM

ఉన్నావ్ బాధితురాలు తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఈమెకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. బ్లడ్ కల్చర్ పరీక్ష నిర్వహించగా.. ఆమె రక్తంలో బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకిందని వారు తెలిపారు. గత జులై 28 న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొనడంతో ఈమెతో బాటు ఈమె లాయర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళ మరణించింది. బాధితురాలిని మొదట లక్నో లోని ఆసుపత్రికి, ఆ తరువాత సుప్రీంకోర్టు జోక్యంతో మరింత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం ఈ నెల 5 న ఢిల్లీ లో గల ఎయిమ్స్ కు తరలించారు. బాధితురాలికి క్రమేపీ శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే ప్రాణాంతకమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. యూపీలోని ఉన్నావ్ లో రెండేళ్ల క్రితం బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఈమెపై అత్యాచారం జరిపాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu