Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

|

Aug 06, 2021 | 2:21 PM

Encounter in Rajouri: జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్

Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
Encounter In In Jammu And Kashmir
Follow us on

Encounter in Rajouri: జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. కాశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలోని థనామండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

థానమండి పట్టణానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంగై అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. గత కొంతకాలంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకాలాపాలను అరికట్టేందుకు బలగాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేపడుతున్నాయి. అంతకుముందు జరిగిన ఎన్‌కౌంటర్లల్లో పలువురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

Also Read:

కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల సమరశంఖం.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలకు మద్దతు

Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్