దీపావళి ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పండుగపూట ఇద్దరు చిన్నారులు చెక్‌డ్యామ్‌లో పడి మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్‌లో చోటు చేసుకుంది. దీపావళి పండుగ పూట ఆ కుటుంబం తమ ఇద్దరు చిన్నారులనూ కోల్పోయింది. రేజింతల్‌లో స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెక్‌డ్యామ్‌లో జారిపడి చనిపోయారు. స్థానికులు గమనించేలోపే ఇద్దరు పిల్లలు మునిగిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కావడంలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.