Mancherial: బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. నకిలీ బంగారంతో 1.2 కోట్ల రుణం..

| Edited By: Subhash Goud

Jun 25, 2021 | 6:38 AM

Cheating SBI: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో భారీ మోసం వెలుగుచూసింది. జిల్లాలోని నస్పూర్ ఎస్‌బీఐలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న

Mancherial: బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. నకిలీ బంగారంతో 1.2 కోట్ల రుణం..
Cheating
Follow us on

Cheating SBI: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో భారీ మోసం వెలుగుచూసింది. జిల్లాలోని నస్పూర్ ఎస్‌బీఐలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు 350 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల పోలీసులు ఇద్దరు నిందితులను మీడియా ఎదుట గురువారం ప్రవేశపెట్టారు. నస్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఐలో ఈ ఇద్దరు 2 కిలోల బంగారంపై 1 కోటి 1 లక్ష 36 వేల 551 రూపాయల రుణం తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చారు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకొకరు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే.. మోసం గురించి తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మంచిర్యాల అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. రంగూ అరుణ్ కుమార్ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి పెద్ద మొత్తం రుణం తీసుకున్నాడని తెలిపారు. వాహన తనిఖీ సమయంలో నాస్‌పూర్‌లో రంగూ అరుణ్ కుమార్, అతని స్నేహితుడు అమ్మ సంతోష్ కుమార్ అనుమానాస్పదంగా కనిపించడంతో.. వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే.. విచారణ సమయంలో అరుణ్ కుమార్ నేరాన్ని అంగీకరించాడని.. అతనికి మరో నలుగురు, మంకెన లక్ష్మరెడ్డి, కొంగల లింగా రెడ్డి, బొమ్మా అన్వేష్, కాడే జీవన్ సహకరించారని తెలిపారు. వారికి అరుణ్ కొంత నగదు సాయం చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Karthika: సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న రాధ కూతురు కార్తీక‌.. సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఏం చేయ‌నుందంటే..

SVR Rare Photo: యముని వేషంలో ఎస్వీఆర్ ను చూసి ప్రశంసించిన అప్పటి చైనా ప్రధాని.. ఫోటో వైరల్