జెండా పోల్‌కు కరెంట్ షాక్..ఇద్దరు విద్యార్థులు మృతి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండా స్తంభానికి కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు చనిపోయారు. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా కెన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం లోహపు జెండా స్తంభాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగలింది. దాంతో జెండా స్తంభాన్ని పట్టుకున్న విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు దిలీప్ రాణా(15), గణపత్ వాల్వాయ్ (15) చనిపోయారు. […]

జెండా పోల్‌కు కరెంట్ షాక్..ఇద్దరు విద్యార్థులు మృతి
Two Class 10 Students Die of Electric Shock from Flag Hoisting Pole

Updated on: Aug 15, 2019 | 7:03 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండా స్తంభానికి కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు చనిపోయారు. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా కెన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం లోహపు జెండా స్తంభాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగలింది. దాంతో జెండా స్తంభాన్ని పట్టుకున్న విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు దిలీప్ రాణా(15), గణపత్ వాల్వాయ్ (15) చనిపోయారు.

మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వారు చనిపోయారంటూ రోదిస్తున్నారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.