Insane uncle : మతిస్థిమితం లేని బాబాయి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులు.. రేపల్లెలో ఘోరం

మతిస్థిమితం లేని బాబాయి చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు అన్నెంపుణ్యం ఎరుగని చిన్నారులు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఈ దారుణం చోటు చేసుకుంది..

Insane uncle : మతిస్థిమితం లేని బాబాయి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులు..  రేపల్లెలో ఘోరం
Insane Uncle Murders

Updated on: Jun 28, 2021 | 8:31 PM

Two children who lost their lives : మతిస్థిమితం లేని బాబాయి చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు అన్నెంపుణ్యం ఎరుగని చిన్నారులు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఈ దారుణం చోటు చేసుకుంది. రేపల్లె 23 వార్డులో మోర్ల విజయలక్ష్మీ నివసిస్తోంది. ఆమె ఇద్దరూ కుమార్తెల్లో ఒకరైన ఉమాదేవిని వేజేండ్లకు చెందిన కోటేశ్వరావుకిచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరూ కుమారులున్నారు. కోటేశ్వరావు, ఉమాదేవిలు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కావడంతో ఉమాదేవి తన కుమారులు పార్ధివ్, రోహిత్ కలిసి అమ్మ వద్ద ఉంటుంది.

అదే ఇంట్లో ఉమాదేవి చెల్లెలు శారద ఆమె భర్త శ్రీనివాసరావు కూడా ఉంటున్నారు. ఇవాళ సాయంత్రం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాసరావు పిల్లలిద్దరిపై కర్రతో దాడి చేశాడు. ఈ దాడి లో తీవ్ర గాయాలైన పిల్లలను అనంతరం హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారు. అయితే శ్రీనివాసరావు గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఉమాదేవి బంధువులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన రేపల్లె పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read also : Anantapur : అక్రమ బంధానికి అడ్డొస్తున్నాడని సొంత కొడుకుని ఆ తల్లి ఏం చేసిందంటే..!