Two Children swim death: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు కళ్లముందు కదలాడిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. మెళియాపుట్టి మండలం, గొప్పిలి గ్రామంలో ఈ విషాద ఘటన జరగింది.
గొప్పిలి పెద్దవీధికి చెందిన దామోదర సాహు, లక్ష్మీ సాహు దంపతుల కుమార్తె సురభి సాహు, వారి పొరుగింట్లో ఉండే దీనబంధు, దమయంతి బెహరా దంపతుల కూతురు హారిక బెహరా ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారి సైతం గ్రామశివారులోని చెరువు వద్ద పిల్లల దుస్తువులను స్థానికులు గుర్తించారు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఇద్దరు పిల్లల మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదచ్చాయలు అలుముకున్నారు. కూలీ పని చేసుకుని జీవించే దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు విగతాజీవులుగా కనిపించడంతో తీవ్ర దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.