AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Case : బెంగళూరు టు తిరుపతి.. మాజీ సీఎం బంధువు హత్య కేసులో కీలక మలుపు..

బెంగళూరు మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ బంధువు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సిద్ధార్థ్‌ హత్య కేసులో ఏ1 శ్యామ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి కొర్లగుంటలో ఉరేసుకుని చనిపోయాడు..

Murder Case : బెంగళూరు టు తిరుపతి.. మాజీ సీఎం బంధువు హత్య కేసులో కీలక మలుపు..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:21 PM

Share

Murder Case : బెంగళూరు మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ బంధువు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సిద్ధార్థ్‌ హత్య కేసులో ఏ1 శ్యామ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి కొర్లగుంటలో ఉరేసుకుని చనిపోయాడు. ఈ కేసులో నిందితులు శ్యామ్‌, వినోద్‌ ఇద్దరూ తిరుపతి వాసులే.

ఈ కేసులో వినోద్‌ పట్టుబడటంతో శ్యామ్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. అటు వినోద్‌ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. రైలు గాయాలతో బయటపడ్డ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వినోద్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు తీసుకొచ్చారు. అక్కడే సిద్ధార్థను పూడ్చిపెట్టారు. రేపు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు పోలీసులు. మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్ట్‌మార్టం చేయనున్నారు వైద్యులు.

నేరం ఎలా జరిగిందంటే..

నెల్లూరులో జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చి అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. రావూరు అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి లభించిన ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ బంధువు అయిన సిద్దార్ద్ సింగ్.. బెంగళూరులో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొద్దిరోజులు క్రితం సిద్దార్ద్ కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు.

అనుమానితులను విచారించగా హత్య చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా రావూరు ప్రాంతానికి చెందిన వినోద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన