ట్రైబల్ హాస్టల్లో కలకలం..ముగ్గురు విద్యార్థినిలకు గర్భం

గిరిజన హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థినిలకు ఎంతమేర రక్షణ ఉంది..? పేదరికంతో హాస్టళ్లకు వెళ్లి చదువుకుంటోన్న యువతులు సేఫ్‌గానే ఉంటున్నారా..? నో.. ఈ ఘటన వింటే ఒళ్లు గగుర్పొడవటం ఖాయం. ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు గర్బం దాల్చడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ట్రైబల్ హస్టల్లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పది మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రికి […]

ట్రైబల్ హాస్టల్లో కలకలం..ముగ్గురు విద్యార్థినిలకు గర్భం

Edited By:

Updated on: Dec 28, 2019 | 4:33 PM

గిరిజన హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థినిలకు ఎంతమేర రక్షణ ఉంది..? పేదరికంతో హాస్టళ్లకు వెళ్లి చదువుకుంటోన్న యువతులు సేఫ్‌గానే ఉంటున్నారా..? నో.. ఈ ఘటన వింటే ఒళ్లు గగుర్పొడవటం ఖాయం. ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు గర్బం దాల్చడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ట్రైబల్ హస్టల్లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పది మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు అధికారులు.

అక్కడ పరీక్షల అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. ఆ పది మందిలో మగ్గురు అమ్మాయులకు ప్రెగ్నెస్సీ టెస్ట్ పాజిటీవ్ రాగా, అందులో ఒకరికి 3 నెలల గర్భం అని తేలింది. హస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా.. సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.