Krishna District Tragedy: కృష్ణాజిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆట సరదా నలుగురి ప్రాణాలను తీసింది. కైకలూరు మండలం వరాహపట్నంలో ఈ ఘటన జరిగింది. వరాహపట్నం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులుఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. దీంతో ఈత రాక నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు, ఒక బాలుడు గా గుర్తించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగ వేడుకల్లో ఉన్న గ్రామం.. చిన్నారుల మృతితో శోకసంద్రంగా మారిపోయింది.