చీటింగ్‌ కేసులో “ఎవడ్రా హీరో’ కథానాయకుడు..

మోసాలకు పాల్పడుతున్న ఓ సినిమా హీరోను పోలీసులు అరెస్ట్‌ చేశారు. “ఎవడ్రా హీరో’ సినిమాలో హీరోగా నటించిన షేక్ బషీద్ అలియాస్ బాసిత్ ను హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీద్‌పై ఏకంగా 11 కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందిన షేక్‌ బషీద్‌ అలియాస్‌ బాసిత్‌..”ఎవడ్రా హీరో’ మూవీలో హీరో గా నటించారు. బీకాం వరకు చదువుకున్న బషీద్‌ తొలుత గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2008లో […]

చీటింగ్‌ కేసులో ఎవడ్రా హీరో' కథానాయకుడు..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 16, 2019 | 4:19 PM

మోసాలకు పాల్పడుతున్న ఓ సినిమా హీరోను పోలీసులు అరెస్ట్‌ చేశారు. “ఎవడ్రా హీరో’ సినిమాలో హీరోగా నటించిన షేక్ బషీద్ అలియాస్ బాసిత్ ను హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీద్‌పై ఏకంగా 11 కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందిన షేక్‌ బషీద్‌ అలియాస్‌ బాసిత్‌..”ఎవడ్రా హీరో’ మూవీలో హీరో గా నటించారు. బీకాం వరకు చదువుకున్న బషీద్‌ తొలుత గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు.

2008లో హైదరాబాద్‌ వచ్చి ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో ఫైనాన్స్‌ సంస్థలను ప్రారంభించాడు. చిన్నపాటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు గ్యారెంటర్‌గా ఉండి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడటానికి అలవాటు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. తాజాగా.. హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి రూ.15 కోట్ల రుణం కావాలని ఆశ్రయించగా.. అతడి నుంచి బషీద్‌ రూ.65 లక్షలు వసూలు చేశాడని, గుంటూరుకు చెందిన మరో వ్యక్తి రూ.10 కోట్ల రుణం కావాలని సంప్రదించగా రూ.32.50 లక్షలు వసూలు చేశాడు. రుణం మంజూరుపై అడిగిన వీరిద్దరినీ బషీద్‌ బెదిరించాడంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితులిద్దరి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.