ఓ చిన్న అనుమానం.. అంతే చిన్న క్లూ.. ఓ హంతకుడిని పట్టించింది. టెక్కీ భువనేశ్వరిని హత్య కేసులో ఈ అనుమానం హత్య కేసును ఛేదించింది. భూవనేశ్వరి హత్యోదాంతం భయటకు రాకుండా ఆమె భర్త శ్రీకాంత్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. కరోనా డేల్టా వేరియంట్ అడ్డంపెట్టుకుని తన కన్నింగ్ బ్రేయిన్‌కు పదును పెట్టాడు. బంధువులకు మస్కా కొట్టాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. ఆ తర్వాత డెల్టా వేరియంట్‌తో మృతి చెందిందంటూ కట్టుకథలు చెప్పాడు. కరోనాతో మరణించడం వల్ల మృతదేహం కూడా ఇవ్వలేదని వాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కూడా నిజమని నమ్మారు. ఇంతవరకు అంతా నమ్మారు. కానీ ఎక్కడో తేడకొట్టింది. అతని ప్రవర్తన.. అతని నటన వారి కుటుంబ సభ్యుల్లో ఓ మహిళన గుర్తు పట్టింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. కరోనా వైరస్ వచ్చిందంటూ శ్రీకాంత్ చెప్పిన మాటలపై అనుమానంతో అపార్ట్ మెంట్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన ఆమె అక్క కూతురు మమత. కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో SI గా పనిచేస్తోంది మమత. ఈ ఒక్క కారణమే శ్రీకాంత్ రెడ్డిని పట్టించింది.
ఈ నెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక పోలీసులకు కాలిన మృతదేహం లభించింది. దీంతో సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా రుయా ఆస్పత్రికి వచ్చిన ఓ డ్రైవర్‌ను అలిపిరి పోలీసులు గుర్తించి విచారించారు. కాగా, నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు బృందాలు తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఆరా తీస్తున్నాయి.