తూర్పుగోదావరి జిల్లాలో పలువురు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పిఠాపురం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోర్టు మార్గంలో ఉన్న పలు దేవుళ్ల విగ్రహాలు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సాయిబాబా, దుర్గామాత, వినాయకుడు విగ్రహాలను ధ్వంసం చేయగా, దుర్గామాత, సీతారామ ఫ్లెక్సీలను అల్లరి మూకలు చించేశారు. కాగా.. ఈ విగ్రహాలను, ఫ్లెక్సీలను చూసిన భక్తులు బిత్తరపోయారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఎవరు చేశారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.