చిన్నారులు ఉన్న ఇంట్లో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే పనులనూ గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. అనే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలు వారికి దొరికిన వస్తువును నోట్లో పెట్టకుంటూ ఉంటారు. ఈ పనులు కొన్ని సార్లు ప్రమాదకరంగా మారవచ్చు. తాజాగా గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు(Tamilnadu) లోని పాక్కం గ్రామంలో జరిగింది.
తమిళనాడులోని పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడున్నరేళ్ల కుమారుడు సంజీశ్వరన్ ఉన్నాడు. ఈ క్రమంలో ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచాడు. అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్.. ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
Tenali Murder: కుటుంబం పరువు తీస్తున్నాడని.. మెడకు కండువా చుట్టి.. అత్యంత పాశవికంగా..
Watch Video: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. నడిరోడ్డుపై బాలికపై దాడి.. బూటు, కర్రతో దారుణంగా.. వీడియో