Three Terrorists Killed : ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ హతం… భార‌త సైనికుల‌కు గాయాలు…

ముగ్గురు పాక్ ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం హ‌త‌మార్చింది. ఈ ఘ‌ట‌న జమ్మూ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబ‌డి చోటు చేసుకుంది....

Three Terrorists Killed : ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ హతం... భార‌త సైనికుల‌కు గాయాలు...

Edited By:

Updated on: Jan 20, 2021 | 2:57 PM

ముగ్గురు పాక్ ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం హ‌త‌మార్చింది. ఈ ఘ‌ట‌న జమ్మూ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబ‌డి చోటు చేసుకుంది. కాగా భార‌త సైనికులు నలుగురు సైతం గాయపడ్డారు. చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసిందని భార‌త‌ రక్షణ వర్గాలు తెలిపాయి. ఎల్‌ఓసీలోని అఖ్నూర్‌ సెక్టార్‌లోని ఖోర్‌ ప్రాంతంలో పాక్ సైన్యం తీవ్ర‌వాదుల‌ను భార‌త్‌లోకి పంపేందుకు మంగళవారం సాయంత్రం నుంచి భారీ కాల్పులను ప్రారంభించాయ‌ని పేర్కొన్నాయి.

షెల్స్‌తో దాడి…

పాక్ సైన్యం నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి విధులు నిర్వ‌హిస్తున్న‌భార‌త సైనికుల‌పైకి షెల్స్‌తో దాడి చేశాయి. ఈదాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని.. ఇదే సమయంలో భారత సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ర‌క్ష‌ణ వ‌ర్గాలు తెలిపాయి. కాగా జ‌మ్మూలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున అల‌జడులు సృష్టించేందుకు ఉగ్ర‌వాదులు, పాక్ ఆర్మీ ఈ దాడుల‌కు పాల్ప‌డింద‌ని అధికారులు తెలుపుతున్నారు.

 

Also Read: Budget Session : జ‌న‌వ‌రి 30న అఖిలపక్ష సమావేశం… రెండు విడుత‌లుగా బ‌డ్జెట్ స‌మావేశాలు…