Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం..

|

Jun 05, 2021 | 11:19 AM

3 people burnt alive in road accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం..
3 people burnt alive in road accident
Follow us on

3 people burnt alive in road accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. అంతేకాకుండా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన మండ్యా జిల్లాలోని మళవళ్లి తాలూకా హలగూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన కేజీ హళ్లి నివాసి షేక్‌ కైజల్‌ (45) కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో భార్య మెహక్‌, కుమార్తెలు మెహైరా, షేక్‌ ఐహిల్‌ (6) , సుహాన (12) తో కలిసి జిల్లాలోని కొళ్లెగాల హనూరుకు బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం వారు పనిచేసుకొని శుక్రవారం ఉదయం మరలా బెంగళూరుకు బయలు దేరారు. ఈ క్రమంలో హలగూరు ఇండియన్ పెట్రోల్‌ బంక్‌ వద్ద కారు అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ స్టోన్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. దీంతో కారు నుంచి భారీగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనలో షేక్‌ కైజల్, సుహాన, షేక్‌ ఐహిల్‌ సజీవదహనమయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలైన మిగతా ఇద్దరిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై హలగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:

Corbevax Vaccine: త్వరలోనే దేశంలో అతి తక్కువ ధరకే కొవిడ్ వ్యాక్సిన్.. పూర్తి వివరాలు

Twitter Ban: ఆ దేశంలో ట్విట్టర్‌‌ బ్యాన్… దేశాధ్యక్షుడి ట్వీట్‌ను డెలీట్ చేసిన రెండ్రోజుల్లోనే..

Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు