Hyderabad: త్రీ ఇడియట్స్.. పట్టపగలే ఇళ్లకు కన్నాలు.. సీసీలకు అస్సలు చిక్కరు.. ఫైనల్‌గా

|

Aug 13, 2021 | 1:18 PM

వీళ్లకు ఇక్కడా...అక్కడా అన్న తేడా లేదు. ఎక్కడ ఇంటికి తాళం కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతారు. పని పూర్తి చేసుకొని కూల్‌గా ఎస్కేప్...

Hyderabad: త్రీ ఇడియట్స్.. పట్టపగలే ఇళ్లకు కన్నాలు.. సీసీలకు అస్సలు చిక్కరు.. ఫైనల్‌గా
Thieves
Follow us on

వీళ్లకు ఇక్కడా…అక్కడా అన్న తేడా లేదు. ఎక్కడ ఇంటికి తాళం కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతారు. పని పూర్తి చేసుకొని కూల్‌గా ఎస్కేప్ అవుతారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆ త్రీ ఇడియట్స్ ఎట్టకేలకు చిక్కారు. దొంగలు రాత్రి వేళల్లో ఇళ్లకు కన్నం వేస్తారు. కానీ ఈ కంత్రీగాళ్లు పట్టపగలే ఇళ్లు గుల్ల చేస్తారు. తలుపుకు తాళం కనిపిస్తే చాలు…వెంటనే వాలిపోయి తలుపు తాళాలు పగలగొట్టి ఇళ్లలోని నగలు, నగదు ఎత్తుకెళ్లిపోతారు.  మీర్‌పేట పీఎస్‌ లిమిట్స్‌లో గత కొద్దిరోజులుగా చోరీలు జరుగుతున్నాయి. వరుస చోరీ కేసుల్ని సీరియస్‌గా తీసుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు…దొంగతనాలు చేస్తున్న ముగ్గురు కేటుగాళ్లైన షేక్ ఫిరోజ్, షేక్‌, వసీమ్‌, షేక్‌ అమీర్‌ని అరెస్ట్ చేశారు. దొంగల్ని పట్టుకున్న పోలీసులు …వాళ్ల దగ్గర నుంచి 14తులాల బంగారు ఆభరణాలు, రూ. 9.63లక్షల నగదుతో పాటు ఒక పల్సర్‌ బైక్‌ని రికవరీ చేసుకున్నారు.

మీర్‌పేట్‌ పరిధిలో చోరీలు చేస్తున్న వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉండగానే …ఓయూ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలు తొలగించిన దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బు, గోల్డ్ ఎత్తుకెళ్లారు. ఈకేసులో స్థానికంగా ఉండే షేక్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తి.. నిజామాబాద్‌కి చెందిన వశీమ్, అమీర్ అనే పాతనేరస్తులతో చేతులు కలిపి ఇదంతా చేసినట్లు నిర్ధారించారు. ఇందులో వసీమ్‌ తాళాలు వేసివున్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహిస్తే…ఇంట్లో చోరీ చేసి సొత్తు మాయం చేసేవాళ్లని పోలీసులు తెలిపారు. ఈచోరీల్లో రెక్కీ నిర్వహించడానికి నిజామాబాద్‌లో దొంగిలించిన ఓబైక్‌ నెంబర్‌ ప్లేట్ మార్చారు. దానిపైనే రెక్కి నిర్వహించి…వరుస చోరీలు చేస్తూ వచ్చారు. ఈ గ్యాంగ్‌ ఖాతాలోనే మరికొన్ని చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి

ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్… హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం