Three-day-old baby kidnapped: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గుంటూరు జీజీహెచ్‌లో చోటుచేసుకుంది. పసికందు అదృశ్యమవ్వడం జిల్లాలో కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సమయంలో మూడ్రోజుల మగ శిశువు అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. తాత, అమ్మమ్మ వద్ద పడుకొని ఉన్న చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో అప్రమత్తమైన వారు జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
పెద కాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ 12వ తేదీన జీజీహెచ్‌లో ప్రసవించింది. ఈ క్రమంలో రాత్రి వేళ 1.30 సమయంలో బాబుని తీసుకుని నాయనమ్మ, అమ్మమ్మ వార్డ్ బయటకు వచ్చారు. అనంతరం బాబుని పక్కన ఉంచుకుని నిద్రపోయారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా..శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: