Ayyappa Devotees Drowned: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లి ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన ప్రకాశం మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయాన్నే స్నానం చేసేందుకు అయ్యప్ప స్వామి భక్తులు చెరువులో స్నానానికి దిగారు. ఈ క్రమంలో చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు అయ్యప్ప భక్తులు ఒకరితర్వాత ఒకరు మునిగి మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నలుగురు అయ్యప్ప భక్తులు.. చెరువులో పడవలో వెళ్తుండగా.. పడవ తిరగబడి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారిలో ముగ్గురు మరణించగా.. ఒకరు సురక్షితంగా బయటపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: