Alcohol Robbery In AP: కాకినాడ రూరల్ మండలం కరపలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి కొందరు వ్యక్తులు మద్యాన్ని చోరీ చేశారు. అనంతరం దొంగలించిన మద్యాన్ని కారులోకెక్కించి ఉడాయించారు. అయితే అనుకొని పరిస్థితుల్లో మద్యాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. వివరాల్లోకి వెళితే.. కరప మిత్రాగార్డెన్‌లో ప్రభుత్వం మద్యం దుకాణాన్ని నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనల ప్రకారం సిబ్బంది సాయంత్రం 6 గంటలకు దుకాణాన్ని మూసేసి వెళ్లిపోయారు.
దీంతో ఇదే అదునుగా భావించిన కొందరు చీకట్టి అయ్యాక కారులో దుకాణం వద్దకు చేరుకున్నారు. అనంతరం దుకాణం వెనకాల ఉన్న గోడకు కన్నం చేసి లోపలికి ప్రవేశించారు. ఎంచక్కా దుకాణంలో ఉన్న మద్యం కేసులను బయటకు తీసి కారులో ఎక్కించుకొని అక్కడి ఉడాయించారు. అయితే అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న సమయంలోనే వారికి ప్రమాదం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. నడకుదురు చేరుకునే సమయానికి కారు నడిపిస్తోన్న వ్యక్తి కంగారులో రోడ్డుపై ఆగిఉన్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో కారు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ పరిమాణంతో కారులో ఉన్న నిందితులు కారులో నుంచి బయటపడి పారిపోయారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీ కృష్ణ, కరప ఎస్‌ఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితులు దొంగలించిన మద్యాన్ని ఆటోలో కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు.
Also Read: కోవిద్ పాండమిక్ తో రెండు తెలుగు రాష్ట్రాల యువతలో పెరిగిన డిప్రెషన్.. ఓ అధ్యయనంలో వెల్లడి
Black Magic: అధ్యాత్మిక ప్రాంతం ద్వారకా తిరుమల సమీపంలో క్షుద్రపూజల కలకలం.. ఆందోళనలో గ్రామస్తులు!
ఛత్తీస్‌గఢ్‌లో యాక్షన్ మొదలు పెట్టిన మావోయిస్టులు.. ఐరన్ ఓర్ ప్లాంట్ కార్మికుల కిడ్నాప్