Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. శ్రీనగర్‌లోని భగత్ భర్జుల్లాలో పోలీసులపైకి దాడికి తెగబడ్డారు ముష్కర మూకలు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. అతిసమీపం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు స్పాట్‌లో కుప్పకూలారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొనట్టు గుర్తించారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీసు బలగాలను టార్గెట్ చేశారు టెర్రరిస్టులు.
టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులపై కాల్పులు జరిపిన టెర్రరిస్ట్‌ను సాకిబ్ మంజూర్‌గా గుర్తించారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఇక ఉదయం షోపియాన్ జిల్లా బడిగాం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
#WATCH Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today
( CCTV footage from police sources) pic.twitter.com/FXYCvQkyAb
— ANI (@ANI) February 19, 2021
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టు చేశారు భద్రతా దళాలు. రియాసి జిల్లాలో ఉగ్ర స్థావరాన్ని గుర్తించాయి భద్రతా బలగాలు. ఏకే-47, ఎల్‌ఎల్ రైఫిల్, 303 బోల్ట్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నాయి. ఇక పుల్వామా దాడి ఘటన జరిగి రెండేళ్లు పూర్తయిన ఫిబ్రవరి 14నే.. మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. జమ్ముకశ్మీర్ బస్టాండ్‌లో 7 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
ఆ సమస్యతో బంగారు భవనాన్ని అమ్ముతున్న యజమాని.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..