
Chittoor: చిత్తూరు జిల్లా వికోట మండలం రామతీర్థం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం చెల్లించాలని మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ యాజమానీ ఇంటి ముందు మృతదేహాలతో ధర్నాకు దిగారు. ఒక్కో బాధితుడి కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం చెల్లించాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. దీంతో ఇరుపక్షాలకు రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయాత్నించగా వారి ప్రయాత్నాలు విఫమయ్యాయి. అటు లారీ యాజామాని ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో రామతీర్థం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.