‘చదువే జీవితం కాదు.. పరీక్షలే ఫైనల్ కాదు’ అని చెబుతున్నా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చిన్నచిన్న కారణాలకు క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని కుంగుబాటుకు గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్ జిల్లా ధర్మారం లోని తిరుమల నర్సింగ్ హోమ్ కళాశాలలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని తెలుసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన శిరీష సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరి వేసుకుంది.
కాసేపటికి ఇది గమనించిన శిరీష సోదరులు చున్నీ విప్పీ ఆమెను కిందకు దించగా.. అప్పటికే ఆమె మరణించింది. ఇదే సమయంలో పొలంపనుల్లో బిజీగా ఉన్న తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని తల్లడిల్లిపోయారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృతదేహాన్ని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో
Aishwaryaa Rajinikanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రజనీకాంత్.. కారణమేంటంటే..