పులి చర్మం అక్రమ రవాణా కేసును ఛేదించిన అటవీ శాఖ అధికారులు.. విచారణలో సంచలన నిజాలు!

|

Nov 01, 2021 | 9:29 AM

ఆదివాసీల ఆందోళన టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. అధికారులు, గ్రామస్తుల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పులిని చంపారన్న ఆరోపణలతో అరెస్టుకు వచ్చిన అధికారులపై దాడి జరిగింది.

పులి చర్మం అక్రమ రవాణా కేసును ఛేదించిన అటవీ శాఖ అధికారులు.. విచారణలో సంచలన నిజాలు!
Tiger Skin Smuggling Case
Follow us on

Tiger Skin Smuggling Case: ఆదివాసీల ఆందోళన టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. అధికారులు, గ్రామస్తుల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పులిని చంపారన్న ఆరోపణలతో అరెస్టుకు వచ్చిన అధికారులపై దాడి జరిగింది. 10 మంది అనుమానితులను బలవంతంగా తీసుకెళ్తున్న వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. రోడ్డుపై ధర్నాకు దిగారు. వచ్చిపోయే వాహనాలను అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులను ఛేదించుకొని వాహనంలో వెళ్లిపోయారు అధికారులు.

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్‌ ఫారెస్ట్‌ ఏరియాలో ఆదివాసీయుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పులి చర్మం కేసులో అమాయకులను అరెస్ట్‌ చేశారంటూ ఇంద్రవెళ్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అరెస్టుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. గ్రామస్థుల ఆందోళన, నిరసనల మధ్యనే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు.. ఫారెస్ట్‌లో వేటగాళ్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంత నిఘా, సీసీ కెమెరాలు పెట్టినా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పులలకు నిలయమైన ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో స్మగ్లర్లు అడవి జంతువులను రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. వాటి చర్మాన్ని, గోర్లను తీసుకొని విదేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు.

తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి రాగా.. గోప్యంగా ఉంచిన అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. రెండు పులుల హతం అయినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటిలో ఒక చర్మాన్ని పట్టుకున్నట్టు.. మరో చర్మం పక్క రాష్ట్రానికి తరలించినట్టు సమాచారం. అయితే.. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. చంపేసిన పులులు కూడా కాగజ్‌నగర్‌ కారిడార్‌లో సంచరించిన పులులుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇంద్రవెళ్లి, హీరాపూర, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లో మాత్రం రహస్యంగా విచారణ కొనసాగతోంది. ఈ సందర్భంలోనే అరెస్టుకు వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలయింది.

ఇంద్రవెళ్లి మండలం వాలుగొండలో గత ఏడాది ఉచ్చులు పెట్టి పెద్దపులిని వేటగాళ్లు మట్టుపెట్టారు. ఇందుకు సంబంధించి పది మందిని కాగజ్ నగర్ డివిజన్‌ పారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వాలుగొండ నుండి మహరాష్ట్ర కు అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తుండగా కాగజ్ నగర్ లో కొట్నాక దేవరావు, గొడుగు అవినాశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అటవీ శాఖ అదికారులు. అధికారుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్ల కాలంలో పదుల‌ సంఖ్యలో దుప్పులు, జింకలు వణ్యప్రాణులను మట్టుపెట్టినట్టుగా ఆధారాలు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉణ్నాయి.

ఇదిలావుంటే, ఇంద్రవెళ్లి మండలం వడగం గ్రామంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పులి హతం కేసులో వడగం గ్రామానికి చెందిన మేస్రం మంకు , దీపక్ , చంద్రకాంత్ , ఈశ్వర్ , లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ ఉన్నతాదికారులు స్మగ్లర్ల గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు. పెందూర్ ముకుంద రావుతో కలిసి పులి గోళ్లను‌, చర్మాన్ని ఏడాది పాటుగా నిందితులు దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో పులి హత్య , అక్రమంగా పులి చర్మం , గోళ్లు తరలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో సిర్పూర్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు నిందితులను‌ హాజరుపరిచినట్లు ఆసిపాబాద్ డీఎఫ్‌వో తెలిపారు.

Read Also…  Rare Hobby: ఈ వ్యక్తి చేసే పనికి మెచ్చుకోకుండా ఉండరు..! విద్యార్ధుల చూడాల్సిన మ్యూజియం..(వీడియో)