20 నెలల చంటి బిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలేసి ఆరు రోజుల పాటు పార్టీలకు వెళ్లిందో టీనేజ్ తల్లి. ఆహారం, నీరు లేక ఆ బిడ్డ చనిపోయింది. పసిబిడ్డ మృతికి కారణమైన తల్లి హత్యానేరంతో జైలుపాలైంది. లండన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన కేసుపై లూవెస్ క్రౌన్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. నిందితురాలు తాను చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించి, కన్నీరు మున్నీరుగా విలపించింది. విచారణను మే 28కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
బ్రైటన్‌కు చెందిన వెర్ఫీ కుడి.. 2019 డిసెంబర్‌లో తన పుట్టిన రోజు సందర్భంగా లండన్‌లో ఆరు రోజుల పాటు పార్టీలకు వెళుతూ కూతురు ఆసయని ఇంట్లోనే వదిలేసింది. పార్టీలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది. అయితే కూతురు ఆసయ ఆరు రోజుల పాటు తిండి, నీరు లేక చనిపోయింది. కూతురు ఎంత పిలిచినా లేవకపోయే సరికి ఆమె 999కు ఫోన్ చేసింది. అనంతరం పసిబిడ్డను ఆసుపత్రికి తరలించారు. పాప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెర్ఫీని అదుపులోకి తీసుకున్నారు. తల్లి 18 ఏళ్ళు నిండని ఎడాలసెంట్ కావడంతో బిడ్డ సంరక్షణను ప్రభుత్వం తీసుకుంది. చైల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద సోషల్ వర్కర్‌ని ప్రభుత్వం ఎందుకు నియమించలేదో విచారణలో తేలనుంది.
Also Read: అత్తింటి వారిపై కోపం..చేపల కూరలో స్లో పాయిజన్.. అత్తా, మరదలు మృతి.. అసలు విషయం ఏంటంటే..?
13 ఏళ్ల వయస్సులోనే గర్భవతి అయ్యి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం.. ఇప్పుడు ఆమె సంపాదన షాకింగ్..