Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!

|

Dec 20, 2021 | 5:15 PM

తమిళనాడులో మరో దొంగ బాబా లీలలు బయటపడ్డాయి. మాయమాటలతో మహిళలను లోబర్చుకుని.. వచనల పేరుతో వంచనకు పాల్పడుతున్న దొంగ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!
Crime
Follow us on

Tamil Nadu Fake Baba assaulted Women: తమిళనాడులో మరో దొంగ బాబా లీలలు బయటపడ్డాయి. మాయమాటలతో మహిళలను లోబర్చుకుని.. వచనల పేరుతో వంచనకు పాల్పడుతున్న దొంగ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళా భక్తులకు మత్తు మందిచ్చి అత్యాచారాలకు పాల్పడుతోన్న నాను బాబా అలియాస్ శంకర్‌ నారాయణన్‌ ఆట కట్టించారు పోలీసులు. నాను బాబాకి అకృత్యాలకు సహకరిస్తున్న అతని భార్యను కూడా కటకటాల వెనక్కి నెట్టారు ఖాకీలు.

తమిళనాడు రాజధాని నగరం చెన్నై శివార్లలోని షిరిడిపురంలో మకాం వేసిన నాను బాబా.. సర్వశక్తి పీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. చిటికెడు విభూతితో ఎలాంటి దెయ్యాన్ని అయినా వదిలిస్తానంటూ కలరింగ్‌ ఇచ్చాడు. నిత్యం టీవీ చానల్స్‌లో ప్రోగ్రామ్స్‌ ఇస్తూ జనానికి వల విసిరేవాడు. ఇదీ, సింపుల్‌గా నాను బాబా కంత్రీ లీలలు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా.. అని నమ్మబలికాడు. ఇలా అనారోగ్య సమస్యలతో వచ్చే వారిని లోబర్చుకుని వారికి మత్తు మందు ఇస్తూ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. అయితే ఓ మహిళ ఫిర్యాదుతో దొంగ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి వ్యవహారం అలస్యంగా వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నాను బాబా మాటలు నమ్మిన ఓ భక్తురాలు తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఆశ్రమానికి వచ్చింది. ఆ యువతిపై కన్నేసిన బాబా… విభూది పేరుతో మత్తు మందు చల్లి ఆమెపై అత్యాచారం చేశారు. వీడియోలు, ఫొటోలు తీసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో ఈ దొంగ బాబా చేసిన ఘోరం బయటికొచ్చింది. దీంతో బాధితురాలి కంప్లైంట్‌తో దొంగ బాబాతోపాటు అతని భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తులో భయంకర నిజాలు బయటికొచ్చాయి. ఇదే తరహాలో చాలా మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు తేలింది. తన దగ్గరకు వచ్చే మహిళా భక్తులపై మత్తు మందు చల్లడం, ఆపై అశ్లీల ఫొటోలు తీయడం, వాటిని చూపించి అత్యాచారం చేస్తూ వచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

Read Also…  Parliament: ఆధార్‌తో ఓటర్ కార్డు లింక్.. విపక్షాల నిరసనల మధ్య ఆమోదం తెలిపిన లోక్‌సభ