Actress Chandini: మాజీ మంత్రికి నటి చాందినీ షాక్.. రూ.10 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టులో దావా..!

|

Jul 24, 2021 | 9:16 AM

అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్‌ ఇచ్చారు. మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Actress Chandini: మాజీ మంత్రికి నటి చాందినీ షాక్.. రూ.10 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టులో దావా..!
Tamil Actress Chandini Petition Against Ex Minister Manikandan
Follow us on

Petition Against Former Minister Manikandan: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్‌ ఇచ్చారు. మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన నటి చాందిని. అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్‌ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు.

ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేయడం సంచలనం రేకేత్తిస్తోంది. అందులో మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్‌ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.

నోమాడ్స్ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న మలేషియా నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో పరిచయం ఏర్పడింది. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది చాందిని. అంతేకాదు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని.

కాగా తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే, జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ అవుతున్నాయి.

Read Also…  

AP Secretariat Exams: సచివాలయ ఉద్యోగులకు అలెర్ట్.. రాత పరీక్షకు డేట్ ఫిక్స్..!

Oneplus Hyderabad: ఇకపై హైదరాబాద్‌ నుంచే దేశ మంతటికీ వన్‌ప్లస్‌ టీవీలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌..