Crime: ఖాకీలా..కామపిశాచాలా..?

|

Feb 24, 2020 | 6:56 PM

ప్రజల్ని కాపాడాల్సిన ఖాకీలే కామపిశాచాలుగా మారుతున్నారు. మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత గల పోలీసులు పెచ్చుమీరుతున్నారు. న్యాయం కోసం వచ్చిన బాధితులపై బెదిరింపులకు దిగుతూ కామవాంఛ తీర్చుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో తరచూ వెలుగులోకి వస్తున్న పోలీసులపై లైంగిక వేధింపులు మొత్తం వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి.

Crime: ఖాకీలా..కామపిశాచాలా..?
Follow us on

ప్రజల్ని కాపాడాల్సిన ఖాకీలే కామపిశాచాలుగా మారుతున్నారు. మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత గల పోలీసులు పెచ్చుమీరుతున్నారు. న్యాయం కోసం వచ్చిన బాధితులపై బెదిరింపులకు దిగుతూ కామవాంఛ తీర్చుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో తరచూ వెలుగులోకి వస్తున్న పోలీసులపై లైంగిక వేధింపులు మొత్తం వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో భార్య ఫిర్యాదు మేరకు ఓ ఎస్సై బాగోతం బట్టబయలైంది.

గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సై వెంకటకృష్ణ వేధింపులు తాళలేక.. అతని భార్య అర్బన్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో తనతో సరిగా ఉండటం లేదని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరాయి మహిళ మోజులో పడి తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది. వెంకట కృష్ణపై గతంలోనే కేసు పెట్టినా పోలీసులు స్పందించలేదని ఆరోపించింది. అయితే, కేసు వెనక్కి తీసుకోవాలంటూ ప్రియురాలితో కలిసి భర్తపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె మరోమారు పోలీసులకు కంప్లైట్ చేసింది. తన భర్తపై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.