గుంటూరుజిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కృష్ణవేణి ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ విద్యార్థిని అనూష దారుణ హత్యకు గురైంది. అనూషను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి. అనూషది ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామం కాగా, అనూషను పొట్టనబెట్టుకున్న విష్ణువర్ధన్ రెడ్డిది బొల్లాపల్లి మండలం పమిడిపాడు. గత కొంతకాలంగా నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి బాధితురాలు అనూషను ప్రేమపేరుతో వేధిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, మరొకరితో అనూష చనువుగా ఉంటుందన్న అనుమానంతో ఈ రోజు ఉదయం మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళిన విష్ణువర్థన్ రెడ్డి.. అనూషను గొంతు నులిమి చంపినట్టు చెబుతున్నారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మృతదేహాన్ని పాలపాడు సమీపంలోని కాలువలో పడవేసినట్టు సమాచారం. హత్య అనంతరం నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also :
దేశ ఆర్థిక రాజధాని, ఒకప్పటి అండర్ వరల్డ్ డెన్.. మరిప్పుడు…! అనుమానాస్పద మరణాలకు కేరాఫ్ అడ్రెస్.!