Shocking Comments On CM KCR: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని పోలిసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు అతడి గురించి ఎంక్వైరీ చేయగా.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం జల్మాలకుంటకు చెందిన ధరావత్ శ్రీను నాయక్‌గా గుర్తించారు.
ఆ యువకుడిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ధర్మాపురం గ్రామ సర్పంచ్ నగేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని అరెస్ట్ చేశామని.. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీను నాయక్ అరెస్ట్ ను నిరసిస్తూ లంబాడీ విద్యార్ధి సేన అధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అతడిని విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట రూరల్ సీఐకి వినతిపత్రం అందజేశారు.
Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్