Srikakulam: పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం, పలువురికి తీవ్రగాయాలు

|

Aug 23, 2021 | 2:53 PM

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది.

Srikakulam: పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం, పలువురికి తీవ్రగాయాలు
Palasa Road Accident
Follow us on

Palasa Road Accident: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయపడ్డారు. ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం బైరిసారంగిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించుకొని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలెరో వాహనం టైరు ఒక్కసారిగా పేలి వాహనం రోడ్డుపక్కన బోల్తా పడింది. అప్పుడే అటునుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో నాలుగు మృతదేహాలు లారీ క్రింద చిక్కుకుపోయాయి.. డెడ్‌బాడీలను వెలికి తీసి పలాసా ఆసుపత్రికి తరలించారు.

Read Also…  Ola vs Honda: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయం అవుతుందా? రెండిటినీ పోల్చి చూస్తే ఎలా ఉంటుందో చూడండి!

Earth from Moon: చంద్రుడిపై నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన తొలి ఫోటో ఇదే!