Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు ఢికొని తండ్రీకుమారుడు మృతి

|

Feb 25, 2021 | 3:04 PM

Chittoor Road Accident: కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో తండ్రీ కుమారుడు ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై గుడిపల్లి సమీపంలో...

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు ఢికొని తండ్రీకుమారుడు మృతి
Follow us on

Chittoor Road Accident: కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో తండ్రీ కుమారుడు ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై గుడిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. జిల్లాలోని వి.కోట మండలం పట్రపల్లికి చెందిన సుబ్బప్ప (65)కు డయాలసిస్ చేయించేందుకు తనకొడుకు కాంతప్ప (43) గురువారం ఉదయం కారులో పీఈఎస్ ఆసుపత్రికి వచ్చి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గుడిపల్లి సమీపంలో అతివేగంతో ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రీ కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

సాక్షాత్తూ మహిళా ఐపీఎస్ అధికారిణిపై అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీ లైంగిక వేధింపుల పర్వం, తమిళనాడులో ప్రకంపనలు

అమెరికాలో అతి భయానక ఘటన.. మనిషిని చంపి గుండెను బంగాళదుంపలతో కూర వండిన కిరాతకుడు

మున్సిపాల్టీలో మీకు పని ఉందా..? అయితే ఒక్కో పనికి ఒక్కో రేటు.. సంచలనం రేపుతున్న సిబ్బంది ఆడియో రికార్డ్స్