Software swami – Vishwa chaitanya baba: సాఫ్ట్ వేర్ బూమ్ మొత్తం గాయబ్. జీవితం సెటిల్ చేస్కోవడం కష్టమని భావించాడా ఇంజినీర్. అంతే తన మైండ్ సెట్ మార్చేసుకుని – బాబాగా బోర్డ్ పెట్టేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు తెరలేపి – మెసాలకు తెగబడ్డాడు. లోతుల్లోకి వెళితే..
కృష్ణాజిల్లాకు చెందిన విశ్వ చైతన్య అప్పట్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అదే ఇప్పట్లో అంతకన్నా హార్డ్ కోర్ బురిడీ బాబా. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉండగా.. అప్పులపాలై పోయాడు. ఈ అప్పులను తీర్చేసి.. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలంటే ఈ జాబ్ సరిపోదని భావించాడు. అంతే ఐడియా ఛేంజ్ చేశాడు. బాబాగా అవతారమెత్తాడు. సాఫ్ట్ వేర్‌కి పేకప్ చెప్పి.. స్వామీజీగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు.
నల్గొండ జిల్లా పీఏ పల్లి – మండలంలో- అజ్మాపురంలో పదెకరాల ప్రాంగణంలో.. ఆశ్రమం తెరిచాడు. ఇక్కడ అమావాశ్య – పౌర్ణమి వస్తే చాలు సందడే సందడి. యజ్ఞాలు యాగాలు హోమాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. భక్త జనాలకు నామాలు పెట్టడం మొదలు పెట్టాడు.
జనం భయాందోళనలు – రోగాలనే వీక్నెస్ లే.. ఈ బురిడీ బాబా ఆయువు పట్టు. రోగాలు నయం చేస్తానంటూ లక్షలాది రూపాయల సంభావనలు వసూలు చేస్తాడు. ప్రవచనాలతో మాయ చేసి.. హోమాలతో కళ్లగప్పి- తాయత్తులతో మభ్య పెట్టేస్తాడు. ఇలా లక్షలాది రూపాయలను వెనకేశాడు విశ్వ చైతన్య.
విశ్వ చైతన్య చేత ఎంత యజ్ఞం చేయించినా- రోగం నయం కాకపోవడంతో.. ఓ బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో విశ్వ చైతన్య పాపాల పుట్ట మొత్తం బట్టబయలయ్యింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులు లక్షలాది రూపాయల డబ్బు- బంగారం- విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఏడాదిన్నర క్రితం- పెట్టిన ఈ ఆశ్రమంలోకి స్థానికులకెవరికీ అనుమతుల్లేవంటున్నారు అజ్మాపురం సర్పంచ్. ఇక్కడికి హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ప్రవేశముంటుందనీ.. వీరికే ఈ నకిలీ బాబా ఆశీస్సులందుతాయనీ.. చెప్పుకొస్తున్నారు. ఇంకా ఈ బురిడీ బాబా ఎన్నేసి మోసాలు చేశారో ఆరా తీస్తున్నారు పోలీసులు.
Read also: Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!