చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం అదృశ్యమైన మహిళ.. పేడ దిబ్బను తొలగిస్తుంటే అస్థిపంజరమై తేలింది. శ్రీకాళహస్తి మండలం నారాయణపురం పంచాయతీ విశాలక్షి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను గగుర్పాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే… విశాలక్షి నగర్‌కు చెందిన ఉష ఖమ్మంకు చెందిన నాగరాజును లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఉష దంపతులు… తల్లి అమ్ములుతో ఒకే ఇంట్లోనే నివాసముంటున్నారు. ఉష శ్రీసిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పని చేస్తుండగా, నాగరాజు మాత్రం ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల వీరు విశాలక్ష్మినగర్‌లో ఇల్లు కట్టుకున్నారు. దీని కోసం తెలిసినవాళ్ల దగ్గర రూ.5 లక్షల అప్పు తీసుకున్నారు. దీంతో అనవసరంగా అప్పులు చేస్తున్నారని… ఉష తల్లి అమ్ములు వారిని మందలించింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అప్పులు ఎలా తీరుతాయని అల్లుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో అమ్ములు కనిపించకుండా పోయింది. తల్లి అదృశ్యం కావడంతో ఉష ఆందోళన చెందింది. భర్త నాగరాజు మాత్రం బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుంది అంటూ లైట్ తీసుకున్నాడు. చుట్టాలు అందరి దగ్గరా వాకబు చేసినా తమ వద్దకు రాలేదని చెప్పడంతో.. జనవరి 9న శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు ఉష కంప్లైంట్ చేసింది. అదే రోజు నాగరాజు కూడా ఏదో పని ఉందని.. తన సొంత ఊరు వెళ్లి.. ఇప్పటికీ తిరిగి రాలేదు. ఉష ఉంటున్న ఇంటి ఆవరణలో ఉన్న పేడ దిబ్బను తొలిగించాలని కొద్ది రోజులుగా ఇరుగుపొరుగువారు గొడవ చేస్తున్నారు.
దీంతో ఉష ఆదివారం పేడ దిబ్బను వేరే చోటికి తరలించేందుకు యత్నించింది. ఈ క్రమంలో అందులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. వెంటనే ఆమె కంగారుతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, తహసీల్దార్ ఘటనాస్థలికి చేరుకొని అస్తి పంజరం బయటకు తీయించారు. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు శవ పంచనామా నిర్వహించారు. అమ్ములు చీర, నాగరాజు లుంగిని పేడ దిబ్బలో గుర్తించారు. దీంతో చనిపోయింది అమ్ములుగా పోలీసులు నిర్ధారించారు. అమ్ములు మృతికి కారణం అల్లుడు నాగరాజు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది… గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..
66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో
తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?