Karnataka: ఆవిరైన ఆనందం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు మృతి

కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి బయల్దేరారు. ఇష్టదైవాన్ని దర్శించుకుని సంతోషంగా ఇంటికి పయనమయ్యారు. మరి కొద్ది సమయంలో స్వగ్రామానికి చేరుకుంటామనగా ఊహించని రూపంలో ప్రమాదం ఎదురైంది. కుటుంబసభ్యులందరినీ కబళించేసింది...

Karnataka: ఆవిరైన ఆనందం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు మృతి
Karnataka Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 05, 2022 | 11:01 AM

కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి బయల్దేరారు. ఇష్టదైవాన్ని దర్శించుకుని సంతోషంగా ఇంటికి పయనమయ్యారు. మరి కొద్ది సమయంలో స్వగ్రామానికి చేరుకుంటామనగా ఊహించని రూపంలో ప్రమాదం ఎదురైంది. కుటుంబసభ్యులందరినీ కబళించేసింది. కారును లారీ ఢీ కొట్టడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిలో 6 నెలల చిన్నారి ఉండటం ఆవేదన కలిగిస్తోంది. కర్ణాటకలోని (Karnataka) రాయచూర్ జిల్లా లింగసుగుర్ మండలంలోని హట్టి గ్రామానికి చెందిన మహ్మద్​మఝర్ హుస్సేన్ తన కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు (Telangana) వచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ సమీపంలో ఉన్న ఓ దర్గాను దర్శించుకుని గురువారం రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. తిరిగి వెళ్తుండగా గురమిట్కల్​ మండలం అరెకేరా వద్ద వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 6 నెలల చిన్నారితో పాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. యాక్సిడెంట్ జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ చదవండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!