మత ప్రార్థనల పేరుతో మహిళలపై ఆకృత్యాలకు పాల్పాడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఆన్‌లైన్‌లో సంస్థను ఏర్పాటుచేసి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనితో కలిసి పనిచేస్తోన్న సంస్థ నిర్వాహకులు సైతం ఈ దారుణ ఆకృత్యాల్లో భాగమయ్యారు. ఎట్టకేలకు ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాఖ (Visakhapatnam) జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంకు చెందిన అనిల్‌కుమార్ అలియాస్ ప్రేమదాస్ మత సంస్థ పేరుతో ఓ ఆశ్రమం నడుపుతున్నాడు. ఆన్‌లైన్ ప్రార్థనల (Religion Prayers) పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. అతని మాయలో పడిన కొందరు మహిళలు నిలువునా మోసపోయారు. తన ఆశ్రమంలో చేరిన మహిళలతో వెట్టిచాకిరీ చేయిండమే కాకుండా వారిని లైంగికంగా వేధించాడు.
30 మందికి పైగా బాధితులు..
ఈ క్రమంలో తెలంగాణలోని కోదాడకి చెందిన ఓ యువతి కూడా ప్రేమదాస్ వలలో చిక్కుకుని మోసపోయింది. అతని వేధింపులు భరించలేని ఆమె గురువారం పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించింది. తనకు ఇష్టం లేకున్నా ఓ యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారని, గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారని సదరు యువతి పోలీసుకుల ఫిర్యాదు చేసింది. నిందితుడు నీలి చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధించేవాడని వాపోయింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం బట్టబయలైంది. కాగా బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరావు తెలిపారు. ఈ యువతిలాగే చాలామంది మహిళలు అనిల్‌కుమార్ చేతిలో మోసపోయారన్నారు. ప్రార్థనల కోసం కడప, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన 30 మందికిపైగా మహిళలు ప్రేమదాస్‌కు రూ.లక్షలు ముట్టచెప్పారని సీఐ పేర్కొన్నారు.
Pushpa: పాలిటిక్స్‌కు పాకిన పుష్ప ఫీవర్.. శ్రీవల్లి ట్యూన్‌తో యూపీలో ఎన్నికల ప్రచారం..
PM Narendra Modi: రేపే హైదరాబాద్ కు ప్రధాని.. కేసీఆర్ స్థానంలో మోడీకి స్వాగతం పలకనున్న ఆ మంత్రి..