Hyderabad: 7 రోజుల పసికందును.. రూ. 3 వేలకు అమ్మిన తల్లి.. ఆ తర్వాత ఏమైందంటే..?

Mother sold Baby: ఓ తల్లి నవమాసాలు మోసి బిడ్డను కన్నది.. ఆ తరువాత పసికందును దారుణంగా మూడు వేల రూపాయలకు బేరం పెట్టింది. ఫలితంగా భూమి మీదకు

Hyderabad: 7 రోజుల పసికందును.. రూ. 3 వేలకు అమ్మిన తల్లి.. ఆ తర్వాత ఏమైందంటే..?
Child

Updated on: Jun 18, 2021 | 9:10 PM

Mother sold Baby: ఓ తల్లి నవమాసాలు మోసి బిడ్డను కన్నది.. ఆ తరువాత పసికందును దారుణంగా మూడు వేల రూపాయలకు బేరం పెట్టింది. ఫలితంగా భూమి మీదకు వచ్చి వారం గడవకుండానే ఆ చిన్నారి తల్లికి దూరమైంది. ఈ అమానవీయ ఘ‌ట‌న‌ హైదరాబాద్ న‌గ‌రంలోని బాచుప‌ల్లిలో వెలుగులోకి వచ్చింది. రాధ అనే మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి గుడిసెలో నివాసం ఉంటోంది. కూలీపని చేసుకుంటూ బతుకెళ్లదీసే ఈ దంపతులకు ఏడు రోజుల క్రితం ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఏమైందో ఏమో కానీ భూమి మీదపడిన మూడు రోజులకే చిన్నారిని అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానికంగా ఉండే శాంత‌మ్మ అనే మ‌హిళ‌కు రూ.3 వేల‌కు విక్ర‌యించింది. ఆ తర్వాత మరో మూడు రోజులకు మళ్లీ తన బిడ్డ తనకు కావాలంటూ చిన్నారిని కొనుక్కున్న మహిళా వద్దకు వెళ్లి తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని కోరింది.

కానీ బిడ్డను ఇచ్చేందుకు శాంతమ్మ ఒప్పుకోలేదు. కన్న తల్లి బతిమాలడంతో పదివేల రూపాయలిస్తే బిడ్డను తిరిగిచ్చేస్తాని శాంతమ్మ చెప్పింది. దీంతో అంత డబ్బు సమకూరకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లింది. దిక్కు తోచ‌ని స్థితిలో రాధ స్థానిక అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌ను ఆశ్ర‌యించింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడంతో పోలీసులు శిశువును సంరక్షణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. అమ్మడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది.

Also Read:

SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు అలెర్ట్.. 45 నిమిషాలు సేవలకు అంతరాయం.. ఎప్పుడంటే..?

Credit Cards: క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? క్రెడిట్ కార్డులను సమర్ధవంతంగా ఇలా ఉపయోగించుకోవచ్చు..