AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్ పేరుతో మోసాలు.. వెలుగుచూస్తున్న సంచలనాలు..!

ప్రముఖ గాయని పేరిట కొందరు కేటుగాళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.7 కోట్లు టోకరా వేశారు. బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సింగర్ పేరుతో మోసాలు.. వెలుగుచూస్తున్న సంచలనాలు..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 3:00 PM

Share

ప్రముఖ గాయని పేరిట కొందరు కేటుగాళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.7 కోట్లు టోకరా వేశారు. బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తపేటకు చెందిన ఓ మహిళ(44) టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయనికి వీరాభిమాని. 2019లో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి గాయని వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చాడు. రెండు, మూడు సార్లు వాట్సాప్‌లో మెసేజ్‌ చేయగానే గాయని బాధితురాలి నంబర్‌ను బ్లాక్‌ చేశారు. బాధితురాలు.. వేరే నంబర్‌ నుంచి ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అంటూ మెసేజ్‌ చేసింది. సరేనంటూ.. అప్పటి నుంచి ఛాటింగ్‌ చేయడం మొదలుపెట్టారు.

ఒకరోజు కేరళలో ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్‌’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో.. బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి.. పలు దఫాలుగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించేవారు. వీడియో కాల్‌ మాట్లాడేవారు కాదు. అనంతరం అనుమానం వచ్ఛి. గాయని వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చిన వ్యక్తి, మరికొందరితో కలిసి మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. చైతన్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అరెస్ట్ అయిన చైతన్యను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Follow Us
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్