SBI Customers Alert: బ్యాంక్ నుంచి ఫ్రీ గిఫ్ట్ అంటూ మెసేజ్ వచ్చిందా? కాస్త ఆగండి బ్రో..

|

Jun 18, 2021 | 11:36 AM

Bank Customers Alert: బ్యాంక్ కస్టమర్లను టార్గెట్‌ చేస్తూ సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ఐడియాతో అమాయక ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. స్ట్రాంగ్ స్కెచ్ వేసి మరీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మను పూర్తిగా ఊడ్చేస్తున్నారు.

SBI Customers Alert: బ్యాంక్  నుంచి ఫ్రీ గిఫ్ట్ అంటూ మెసేజ్ వచ్చిందా? కాస్త ఆగండి బ్రో..
Free Gift
Follow us on

Beware Bank Customers: బ్యాంక్ కస్టమర్లను టార్గెట్‌ చేస్తూ సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ఐడియాతో అమాయక ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. స్ట్రాంగ్ స్కెచ్ వేసి మరీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మను పూర్తిగా ఊడ్చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల(Cyber Frauds) ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు, బ్యాంకర్లు చాలా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా చివరకు సైబర్ కంత్రీగాళ్లే పైచేయి సాధిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే నిత్యం పదుల సంఖ్యలో జనం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తమ కస్టమర్లను అలెర్ట్ చేసింది. కస్టమర్లను మోసగించేందుకు ఈ సైబర్ కంత్రీగాళ్లు ఎంచుకుంటున్న కొత్త రకం మోసం గురించి వివరించింది. దీని ప్రకారం నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు మెయిల్స్ పంపుతున్నారు. ఫ్రీ గిఫ్ట్‌ను క్లెయిమ్ చేసేందుకు ఈ లింక్ క్లిక్ చేయాలని అందులో సూచిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారం మొత్తం క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఈ సమాచారం ఆధారంగా వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు.

ఫ్రీ గిఫ్టుల పేరిట వస్తున్న ఈ ఫిషింగ్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ తమ కస్టమర్లకు సూచించింది. ఫ్రీ ఫ్రీ అనగానే ఏ లింక్ అంటే ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దని…ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవుపలికింది. ఉచిత గిఫ్ట్ పేరిట వచ్చే ఈ మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచించింది.

ప్రజల బలహీనతలనే తమ బలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒకటి ఫ్రీ అనగానే జనం సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడిపోతున్నారు. ఫ్రీ గిఫ్ట్‌ అంటూ వచ్చిన మెయిల్స్‌లో  లింక్స్  క్లిక్ చేసి తమ బ్యాంకు ఖాతాలో సొమ్మును కోల్పోయినట్లు దేశ వ్యాప్తంగా చాలా మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.

Also Read…

Hyderabad: పోలీస్ కుటుంబాల‌నూ వ‌ద‌ల‌ని సైబ‌ర్ కంత్రీగాళ్లు.. తాజాగా సీఐ భార్య‌ను ఎలా మాయ చేశారంటే

Helpline Number: సైబర్‌ నేరగాళ్ల ఆన్‌లైన్‌ మోసాలకు హెల్ప్‌లైన్‌ చెక్‌.. వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి