Saidabad Incident: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు అంత్యక్రియలు.. భారీ బందోబస్తు మధ్య పూర్తి

|

Sep 16, 2021 | 9:19 PM

హైదరాబాద్‌ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిని బలి తీసుకుని.. ఆత్మహత్య పాల్పడ్డ రాజు అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్‌లోని పోతన స్మశాన వాటికలో నిర్వహించారు.

Saidabad Incident: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు అంత్యక్రియలు.. భారీ బందోబస్తు మధ్య పూర్తి
Accused Raju Funeral
Follow us on

Accused Raju Funerals: హైదరాబాద్‌ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిని బలి తీసుకుని.. ఆత్మహత్య పాల్పడ్డ రాజు అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్‌లోని పోతన స్మశాన వాటికలో నిర్వహించారు. రాజు స్వగ్రామం ఆత్మకూరు మండలం అడ్డగూడూరుకు డెడ్‌బాడీ తీసుకెళ్లాలని తొలుత భావించినా.. అందుకు ఆ గ్రామస్తులు నిరాకరించారు. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో భారీ పోలీసు బందోబస్లు నడుమ.. వరంగల్‌లోనే అంతిమ సంస్కారం నిర్వహించారు కుటుంబ సభ్యులు. అంతకు ముంద ఉద్రిక్తత పరిణామాల మధ్య రాజు మృతదేహనికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం స్థానికంగా ఉన్న స్మశానంలో బంధువులు అంత్యక్రియలను పూర్తి చేశారు.

హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని చిదిమేసి పారిపోయిన రాజు.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తేలాడు. ఘన్‌పూర్‌కి, నష్కల్‌కి మధ్యలో గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. అక్కడే ఉన్న గ్యాంగ్‌మెన్‌ అతడి మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని అందించడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహం చేతికున్న టాటూని బట్టి చనిపోయింది రాజేనని నిర్థారించుకున్నారు. ఈ వార్త ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ చూసినా సంబరాలు. వాడికి తగిన శాస్తి జరిగిందని అంతటా హర్షం వ్యక్తమైంది. సింగరేణి కాలనీలో బాణసంచా పేలుళ్లు కనిపించాయి.

వరంగల్‌ ఎంజీఎంలో రేపిస్ట్‌ రాజు డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టమ్‌ జరిగింది. అతడి మృతదేహాన్ని వాహనంలో తరలిస్తున్న సమయంలో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడి మృతదేహంపైనా దాడిచేసేందుకు వెనకాడలేదు స్థానికులు. ఇక వరంగల్‌ ఎంజీఎంలో కుటుంబసభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయింది రాజేనని పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పోస్టుమార్టమ్‌ అనంతరం అంత్యక్రియలు పూర్తయ్యాయి.


Read Also…  ఆఫ్గాన్ మహిళలకు తాలిబన్ల ఆదేశం.. సోషల్ మీడియా ద్వారా తమ తిరుగుబాటును ఎలా వ్యక్తం చేశారో తెలుసా..

Electric Scooters: ఒకాయా కంపెనీ నుంచి తక్కువ ధరలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే లుక్ దీని స్పెషాలిటీ!

YS Sharmila: చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడు.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు