Rowdy sheeter Murder: హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బోరబండలోని తన ఇంటి సమీపంలో ఫిరోజ్ (45)పై కత్తులతో దాడి చేశారు. రక్తమడుగులో పడి ఉన్న ఫిరోజ్‌ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని రినోవా దవాఖానకు తరలించారు. కాగా. ఫిరోజ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also.. నగరంలో నరరూప రాక్షకుడు.. ఒంటరి మహిళలు కనిపిస్తే అంతే.. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్